• Home »
  • Politics »
  • ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు.

ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు.

kcr (1)mmతెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించుకుందామని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అక్టోబర్‌లో నిర్వహించనున్న తెలంగాణ సాహిత్య అకాడమీ, ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోలను ఆయన ప్రగతిభన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాసభల నిర్వహణకు త్వరలో తెలంగాణ సాహితీ ప్రముఖులు, సాహితీ సంస్థలతో విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డికి సూచించారు. ఇందుకు అవసరమైతే తాను అందరు సాహితీవేత్తలతో మాట్లాడుతానని, సమావేశాన్ని ప్రగతిభవన్‌లోనే ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. లోగోలను రూపొందించిన కళాకారులు రమణారెడ్డి, రవిశంకర్‌ను సీఎం కేసీఆర్ అభినందించారు. లోగోల ఆవిష్కరణతో ప్రపంచ తెలుగు మహాసభలు, తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీల కార్యాచరణ ప్రారంభమైందని ఈ సందర్భంగా అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు.