• Home »
  • Politics »
  • అంతర్జాతీయ యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం

narendra-modi-yoga_650x400_81484193947 అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచంలోని అనేక దేశాల్లో వేదికలు సిద్ధమయ్యాయి. భారత్‌లో బుధవారం జరుగనున్న యోగా ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వం వహించనున్నారు. లక్నోలో జరిగే కార్యక్రమంలో 55 వేలమంది ఔత్సాహికులతో కలిసి ఆయన యోగాసనాలు వేయనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఐదువేల కార్యక్రమాలు జరుగుతాయని ఓ సీనియర్ అధికారి చెప్పారు. 150 దేశాల్లో జరిగే యోగా ఉత్సవాలను ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు సమన్వయం చేస్తాయి. చారిత్రాత్మక ప్రదేశాలైన పారిస్‌లోని ఈఫిల్ టవర్, లండన్‌లోని ట్రఫాల్గర్ స్కేర్, న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లలో యోగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. లక్నో నగరంలోని రమాబాయి అంబేద్కర్ మైదాన్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారని చెప్పారు. దేశంలో జరిగే అతిపెద్ద యోగా కార్యక్రమం ఇదేనన్నారు. ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి 2014 డిసెంబర్‌లో తీర్మానించిన సంగతి తెలిసిందే.